దుబ్బాక, జనవరి 17: కేసీఆర్ హయాంలోనే గ్రామాలకు మహర్దశ వచ్చిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. దుబ్బాక, అక్బర్పేట మండ లాల్లో బుధవారం ఆయన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి నూతన గ్రామపంచాయతీ భవనాలు, పలు కమ్యూనిటీ భవనాలను ప్రారంభించారు. చౌదర్పల్లి దుబ్బరాజేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు లేదని అధైర్య పడొద్దని కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. తండాలు, గూడెం, మధిర గ్రామాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి ఫలాలు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. పట్టణాలతో సమానంగా గ్రామాలను అభివృద్ధి చేసి, కుల వృత్తులకు ఆదరణ కల్పించారని గుర్తు చేశారు.
నూతన గ్రామపంచాయతీల్లో సీసీ రోడ్లు, గ్రామపంచాయతీ భవనాలు, ఇంటింటికీ నల్లా నీరు, పల్లె ప్రకృతి వనం , వైకుంఠధామం ఇలా ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశారన్నారు. కేసీఆర్ ప్రభుత్వ పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం క్రీడాకారులకు క్రికెట్ కిట్స్ , క్రీడా సామగ్రిని ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి, జడ్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కైలాష్, ఏఎంసీ చైర్పర్సన్ చింతల జ్యోతీకృష్ణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజమౌళి, భూంపల్లి మనోహర్, సోలిపేట సతీశ్‌రెడ్డి, సర్పంచ్‌లు మాలోతు పెంటవ్వ, మాడూరి శ్రీనివాస్, సోమారం స్వప్నాస్వామి, కుమార్, శేర్ల రచనాకైలాస్, నాయకులు కిషన్‌రెడ్డి, దేవరాజ్ పాల్గొన్నారు.