దుబ్బాక, అక్టోబర్13 : దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తన స్వగ్రామమైన దుబ్బాక మండలం పోతారంలో దసరా పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకొన్నారు. శనివారం గ్రామస్తులతో కలిసి పాలపిట్టను దర్శించుకుని, జంబి చెట్టుకు పూజలు చేశారు. అనంతరం దుబ్బాకలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జనంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డికి బీఆర్ఎస్ శ్రేణులు, యువజన సంఘాల నాయకులు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. పోతారంలో యువజన సంఘం నాయకులు నిర్వహించిన దేవీశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పాడి పంటలతో రైతులు, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని దుర్గామాతను కోరుకున్నట్లు ఆయన తెలిపారు. గ్రామాల్లో యువజన, కుల సంఘాల ఆధ్వర్యంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ప్రజలందరికీ ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.