మెదక్‌లో ఎగిరేది గులాబీ జెండానే
రైతులకు సాగునీళ్లు ఇవ్వని కాంగ్రెస్‌కు, మతం పేరుతో ప్రజల మధ్యన విద్వేషాలు రగిలిస్తున్న బీజేపీకి ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు.
- బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పాలి
- బీజేపీ అభ్యర్థి రఘునందన్ కోతల రాయుడు
- మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం..
- దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక/రాయపోల్, మార్చి 23: రైతులకు సాగునీళ్లు ఇవ్వని కాంగ్రెస్‌కు, మతం పేరుతో ప్రజల మధ్యన విద్వేషాలు రగిలిస్తున్న బీజేపీకి ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. శనివారం రాయపోల్ మండలంలో ఆయన పర్యటించారు. కొత్తపల్లిలో బీఆర్ఎస్ అధ్యక్షుడు దాసరి బాలనర్సు కుటుంబాన్ని పరామర్శించారు. ఆనంతరం విలేకరులతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీస్సులతో రెండు పర్యాయాలు మెదక్ ఎంపీగా భారీ మెజార్టీతో తాను విజయం సాధించినట్లు గుర్తుచేశారు. దుబ్బాక ఎమ్మెల్యేగా సైతం విజయం సాధించానన్నారు.
ఆది నుంచి మెదక్ పార్లమెంట్ ప్రజలు బీఆర్ఎస్కు అండగా ఉన్నారన్నారు. మెదక్ అంటేనే ఉద్యమ ఖిల్లా అని, ప్రస్తుత ఎంపీ ఎన్నికల్లోనూ వెంకట్రామిరెడ్డి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి ప్రజా పాలనపై పూర్తి అవగాహన ఉందన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడంలో ఆయన దిట్ట అన్నారు. ఆయనకు ఉమ్మడి మెదక్ జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేశారు. మెదక్ ఎంపీగా వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులు కృషిచేయాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

