దుబ్బాక, నవంబర్ 2: వానకాలం వడ్ల కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం దుబ్బా క మార్కెట్ యార్డును సందర్శించి ధా న్యాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మను చౌదరితో ఫోన్లో మాట్లాడారు. ధాన్యాన్ని త్వరిత గతిన కొనుగోలు చేయాలని కోరారు. ధాన్యా న్ని కొనుగోలు చేస్తామని కలెక్టర్ చెప్పా రు. అనంతరం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకే దుబ్బాక నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, ఎక్కడా రైతుల నుంచి గింజ ధాన్యం కొనుగోలు చేయలేదని మండిపడ్డారు.
అకాల వర్షాల కారణంగా సెంటర్ల లో ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. అనంతరం 66 మంది బాధితులకు రూ.16,50 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. దుబ్బాక కౌన్సిలర్, బీఆర్ఎస్ నాయకుడు బట్టు ఎల్లం తండ్రి బాలమల్లు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెలే వెంట బీఆర్ఎస్ నాయకులు ఎల్లారెడ్డి, రవీందర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
మెదక్,అక్టోబర్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): సోమవారంలోగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించక పోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆందోళనలు చేస్తామని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించా రు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..కొబ్బరికాయలు కొడుతూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి చేతుల దులిపేసుకోవడం కాదని, త్వరితగతిన ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు.
వానలకు ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదని విమర్శించారు. పంట రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను నిండా ముం చిందన్నారు. రైతు భరోసా ఇవ్వకుండా రైతులను నట్టేట ముంచిందన్నారు. బీఆర్ఎస్ సర్కారు రైతులకు చేయూతనిస్తే, కాంగ్రెస్ రైతులను మోసం చేస్తున్నదని పద్మాదేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.