సిద్దిపేట, అక్టోబర్ 11: విజయ దశమి పర్వదినం సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలకు మాజీమం త్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికి అన్నింటా శుభం చేకురాలని, ప్రజల జీవితంలో దసరాను మించిన పం డుగ లేదన్నారు. దసరా పండుగలో మన సంప్రాదాయం, సంస్కృతితో పాటు ఆత్మీయత మిలితమై ఉందన్నారు.
ఈ పర్వదినాన్ని ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు. చెడు ఎంత శక్తి వంతంగా కనిపిస్తున్నా, చివరికి మంచితనమే విజయం సాధిస్తుందని,దసరా పండుగ దీనిని గుర్తు చేస్తుందన్నారు. చెడు పై మంచి విజయం సాధించిన రోజు విజయ దశ మి అన్నారు. విజయ దశమి రోజు పాలపిట్టను చూస్తే శుభం కలుగుతుందని, అమ్మవారి ఆశీస్సు లు ప్రజల దీవెన ఎల్లప్పుడు ఉండాలని, ఈ దస రా మారిన్ని విజయాలను అందించాలని కోరుకుంటున్నట్లు ప్రకటనలో తెలిపారు.