నంగునూరు, సెప్టెంబర్ 27: తెలంగాణ ఉద్యమానికి కొండా లక్ష్మణ్ బాపూజీకి దగ్గరి సంబంధం ఉందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగునూరులో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ 109వ జయంతి రోజు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని 1969లోనే తన మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి అని గుర్తు చేశారు. 97 ఏండ్ల వయస్సులో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దీక్షా చేపట్టిన వ్యక్తి అని కొనియాడారు.కార్యక్రమంలో పద్మశాలీ సంఘం నాయకులు డాక్టర్ సతీశ్, సంగు పురేందర్, రచ్చ సిద్దు, ఆకుబత్తిని రాము, దాసరి రవి, రామలింగం పాల్గొన్నారు.