సిద్దిపేట, అక్టోబర్ 9: తెలంగాణ సం స్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. దేశం లో పూలను పూజించే, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. అలాంటి గొప్ప సంస్కృతి మన తెలంగాణలో ఉందన్నారు.
మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటిచెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. తొమ్మిది రోజులపాటు తీరొక్క పూలతో ఆడబిడ్డలు గొప్పగా జరుపుకొంటారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ సర్కారు బతుకమ్మ ఉత్సవాల ఖ్యాతిని పెం చిం దని, ఏటా అధికారికంగా ఉత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు. బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ తన హయాంలో ప్రభుత్వం నుంచి చీరలు అందించినట్లు హరీశ్‌రావు గుర్తు చేశారు.