సిద్దిపేట,డిసెంబర్ 25: ప్రపంచానికి ఏస్తుక్రీస్తు ప్రేమభావాన్ని, సేవాతాత్పరతను బోధించారని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు.గురువారం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేట పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని చిన్నారులతో కలిసి క్రిస్మస్ కేక్‌ను కట్‌చేశారు.
అనంతరం అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది ఆనవాయితీగా క్రిస్మస్ వేడుకల్లో ఇకడ పాల్గొంటున్నట్లు తెలిపారు. ప్రేమ భావాన్ని, సేవాతాత్పరతను, క్షమా గుణాన్ని బోధించిన క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్, క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అన్నారు. యేసుక్రీస్తు దీవెనలు ప్రతి ఒకరికీ లభించాలని, అందరూ సంతోషంగా ఉండాలన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం క్రిస్మస్ సందర్భంగా రెండు రోజుల సెలవులు ఇచ్చేదని,పండుగను అధికారికంగా నిర్వహించినట్లు గుర్తుచేశారు. కేసీఆర్ అన్నిమతాలనూ గౌరవించారని, వారివారి పండుగలకు కానుకలు అందించారన్నారు. క్రిస్మస్ కిట్టు, బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫాను కేసీఆర్ అందించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్మస్ కిట్టు ఇవ్వడం మరిచిందని హరీశ్‌రావు అన్నారు. కార్యక్రమంలో రెవరెండ్ ఆంటోని, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, పాల సాయిరాం, కౌన్సిలర్ సాయిశ్వర్గౌడ్, క్రైస్తవ ప్రతినిధులు జాన్‌వెస్లీ, ప్రసాద్, అనిల్, శాంసన్, సత్యానందం,శ్రవణ్, శోభ, సందీప్ తదితరులు పా ల్గొన్నారు.