సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 23: విశ్రాంత ఉద్యోగుల హక్కుల సాధనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల జిల్లా భవనాన్ని సోమవారం ఆయన సందర్శించారు. కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తన గెలుపు కోసం కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం కృషి చేస్తానన్నారు. అనంతరం విశ్రాంత ఉద్యోగులు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను శాలువాతో సన్మానించారు. 2018లో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో సంఘం భవనానికి స్థలం కేటాయించి, నిధులు మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజయేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఆర్ వెంకటేశ్వర్లు, నాయకులు పాల్గొన్నారు.