సంగారెడ్డి, సెప్టెంబర్ 12: ట్రిపుల్‌ఆర్‌లో భూములు కోల్పోతున్న రైతులకు బహిరంగ మార్కెట్లో ఉన్న ధర చెల్లించి న్యాయం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్యను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అభ్యర్థించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ భూనిర్వాసితులతో కలిసి ట్రిపుల్ఆర్ బాధితుల పక్షాన సంగారెడ్డి కలెక్టర్‌కు ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రిపుల్‌ఆర్‌లో సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని గిర్మాపూర్, అలియాబాద్, మారేపల్లి, మాచేపల్లి, గంగారం, శివన్నగూడెం, రాంపూర్‌తండా లు, గ్రామాల పరిధిలోని నిరుపేద రైతులు కోల్పోతున్న భూములపై జీవనం కొనసాగిస్తున్నారన్నారు.
ట్రిపుల్ఆర్ రోడ్డు నిర్మాణంలో పట్టా భూములు కోల్పోకుండా పేద రైతులను కాపాడాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరారు. ట్రిపుల్‌ఆర్‌లో పట్టా భూములు కోల్పోవడంతో మండలంలోని పేద రైతులు రోడ్డున పడతారని కలెక్టర్‌కు వివరించారు. రైతులు సంతృప్తి చెందేలా ట్రిపుల్ఆర్ విధానాలు ఉండాలని సూచించారు. ట్రిపుల్‌ఆర్‌లో భూములు కోల్పోతే జీవించడం భారంగా మారుతుందని, భూములు కోల్పోతున్న రైతుల గురించి ఆలోచించాలని కోరా రు. ఈ కార్యక్రమంలో సీడీసీ మాజీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, నాయకులు మాణిక్‌ప్రభు, రుక్మొద్దీన్, గోవర్ధన్‌రెడ్డి, ప్రేమనం దం, సత్యనందం, ప్రకాశ్, అంజిరెడ్డి, జయేందర్, నర్సింహులు, మహేశ్, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.