కంది, జూలై 18: కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే షరతులు లేకుండా పంట రుణాలు మాఫీ చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీపై ప్రభు త్వం విడుదల చేసిన మార్గదర్శకాలు అభ్యంతరకరంగా ఉన్నాయని గురువారం ఆయన ప్రకటనను విడుదల చేశారు. రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి హామీ లు ఇచ్చి, తెల్లరేషన్‌కార్డు ఇతర అంశాలు ప్రామాణికంగా ప్రకటించడంపై రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి షరతులు లేకుం డా రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు షరతులు ఎందుకు పెట్టిందని ప్రశ్నించారు. కొత్త రేష న్ కార్డులు, ఇండ్ల స్థలాలు, ఇండ్లు, రైతు పెట్టుబడి సా యం, అన్నదాతలకు ఏటా రూ.12వేల సాయం తదితర హామీల సంగతేంటని ఆయన ప్రశ్నించారు. ధరణి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని, కాంగ్రెస్ కళ్లబొల్లి మాట లు, మోసాలను రైతులు, ప్రజలు గమనిస్తున్నారని, భవిష్యత్తులో గుణపాఠం చెబుతారన్నారు.