హుస్నాబాద్, నవంబర్ 1: దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంతో పాటు స్థానిక సింగిల్విండో కార్యాలయంలో జరిగిన లక్ష్మీపూజల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో కలిసి పటాకులు కాల్చి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లక్ష్మీ కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రైతులు, వ్యాపారస్తులు, పరిశ్రమలకు ఎలాంటి ఆటంకం లేకుండా అమ్మవారి ఆశీర్వాదంతో ఆర్థికంగా ముం దుకు పోవాలన్నారు. అనంతరం పట్టణంలోని పలు వీధుల్లో ప్రజలను పలకరిస్తూ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఆటోలో, ద్విచక్రవాహనంపై పర్యటించి ప్రజలకు అభివాదం చేశారు. ఆయనతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య పాల్గొన్నారు.