కోహెడ, సెప్టెంబర్ 8: సిద్దిపేట జిల్లా కోహె డ మండలం గొట్లమిట్టలో ఎనిమిదివందల సంవత్సరాల క్రితం నిర్మించిన వరసిద్ధ లింగేశ్వర ఆలయం పునరుద్ధరణ పనుల్లో భాగం గా ఆదివారం రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. పూ జా కార్యక్రమాలు నిర్వహించి ద్వారా స్థాపన చేశారు. గొట్లమిట్ట, నారాయణపూర్, ఓగులాపూర్ గ్రామాలతో పాటు మండల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొదట పూజారులు గణపతి హోమం నిర్వహించారు. మ ధ్యాహ్నం 12గంటలకు ద్వార స్థాపన అనంతరం అన్నదానం చేశారు.
మండలంలోని రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బొబ్బల కనుకరెడ్డి ఇటీవల కాల్వ లో పడి మృతిచెందాడు. మంత్రి పొన్నం ప్రభాకర్ అతడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం నారాయణపూర్‌లోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఇం దూర్తి ఎల్లమ్మవాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని , పిల్లివాగుపై హైలెవల్ వంతెన నిర్మించాలని మంత్రిని ఆయా గ్రామాల ప్రజలు కోరారు. కార్యక్రమాలలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, బీజేపీ రాష్ట్ర నాయకులు కొమిటిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి, కర్ణకంటి మంజులారెడ్డి, కాంగ్రెస్ నాయకులు మంద ధర్మయ్య, బస్వరాజు శంకర్, కర్ర రవీందర్, గొరిట్యాల లక్ష్మణ్, బందెల బాలకిషన్, బండిపెల్లి నారాయణ, పాము శ్రీకాంత్ , చింతకింది శంకర్ పాల్గొన్నారు.