కోహెడ, అక్టోబర్ 11: సర్కారు విద్యావ్యవస్థను మెరుగుపర్చేందుకు రాష్ట్రంలో 10వేల ఉపాధ్యా య పోస్టులను నియామకం చేసి పత్రాలు అందించామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగల్లపల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల నిర్మాణానికి అడిషనల్ కలెక్టర్ కె.శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం విద్యావ్యవస్థ మెరుగు పరిచేందుకు 10వేల ఉపాధ్యాయ పోస్టు లు భర్తీ చేసిందని, కోట్లాది రూపాయలతో పాఠశాలలను మెరుగుపర్చామన్నారు.
విద్యాసంవత్స రం మొదలయ్యేలోగా యంగ్ ఇండియా ఇంటగ్రేటెడ్ గురుకుల పాఠశాల ప్రారంభం అవుతుందని తెలిపారు. హుస్నాబాద్‌ను అన్నివిధాలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఇంటగ్రేటెడ్ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటగ్రేటెడ్ పాఠశాలకు కోహెడలో స్థలం కోసం అన్వేషన చేయగా తంగల్లపల్లిలో ఉన్నట్లు గుర్తించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి మంజూరు చేయించినట్లు తెలిపారు.
పాఠశాలలో 2500పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తారని అన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలోగా భవ నం నిర్మాణం పూర్తయి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో ప్రారంభిస్తానన్నారు. తంగల్లపల్లి నుంచి బద్దిపడగ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేస్తానని మంత్రి పొన్నం హామీ ఇచ్చా కార్యక్రమంలో హుస్నాబాద్ ఆర్డీవో, తహసీల్దార్ సురేఖ, సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, మంద ధర్మ య్య, గొరిట్యాల లక్ష్మణ్, శ్రీకాంత్, బండిపల్లి నా రాయణ, బండమీది రాజమౌళి, భూంపెల్లి సంజీవరెడ్డి, మంద వెంకటస్వామి, శ్రీనివాస్ గౌడ, జయరాజ్, కర్వేద రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.