సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 18: ఫీజు రీయింబర్స్మెంట్ పేరుతో కళాశాలలు మూసివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా, బీసీ సంక్షే మ శాఖల మంత్రి పొన్నం ప్ర భాకర్ హెచ్చరించారు. గురువారం సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా కేడం లింగమూర్తి ప్రమాణ స్వీకారోత్స వంలో ఆయన పాల్గొన్నారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ..స మాజం మీద అవగాహన ఉన్న వ్యక్తి లింగమూర్తి అని, సిద్దిపేటకు మంచి పేరు తెచ్చేలా పని చేయాలన్నారు.
తన నియోజకవర్గంలోని రెండు మం డలాలు కరీంనగర్ జిల్లాలో, రెండు హన్మకొండ జిల్లాలో, మూడు సిద్దిపే ట జిల్లాలో ఉన్నాయన్నారు. రాబో యే రోజుల్లో ప్రజల ఆకాంక్ష మేరకు పని చేస్తామన్నారు. రెండోదశలో జి ల్లాలోని మూడు నియోజకవర్గాలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌లు వచ్చేలా కృషిచేస్తా అన్నారు. రాష్ట్రం ఆర్థిక సం క్షోభాన్ని ఎదుర్కొంటుందని, రూ.2 లక్షల పైన రుణం ఉన్న వారికి రుణమాఫీ చేయాలని నిర్ణయించామన్నా రు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి లు చెల్లించే బాధ్యత తనది అని..కానీ, కళాశాలలు మూసి వేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. పేరుకు అధికారిక కార్యక్రమం అయినప్పటికీ..అందరూ కాం గ్రెస్ నేతల ఫ్లెక్సీలతోపాటు కాంగ్రెస్ నాయకులే వేదికపై ఉండటం..అం దులో అధికారులు సైతం పాల్గొనడం గమనార్హం. మంత్రి మాట్లాడుతున్న సమయంలో 317 జీవో బాధితులు ఫ్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో తమను సొంత జిల్లాకు పంపిస్తామని హామీ ఇచ్చిందని, చెప్పి న విధంగా పంపించాలన్నారు.