ఒకప్పుడు కరువు కాటకాలతో అల్లాడిన హుస్నాబాద్ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. సీఎం
కేసీఆర్‌కు సెంటిమెంట్ నియోజకవర్గం కావడం, మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ ప్రత్యేక చొరవ కారణంగా ఒకప్పటి హుస్నాబాద్‌కు ఇప్పటి హుస్నాబాద్‌కు ఆస్మాన్ ఫరక్ కనిపిస్తున్నది. అభివృద్ధికి మరింత ఊతం ఇచ్చేందుకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం హుస్నాబాద్ పర్యటనకు వస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. పట్టణం మొత్తం గులాబీమయమైంది. ఆర్టీసీ డిపో సమీపంలోని గ్రౌండ్లో పెద్ద ఎత్తున నిర్వహించే బహిరంగ సభకు వేదిక సిద్ధమైంది. మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మినీ స్టేడియంలో హెలీప్యాడ్ సిద్ధం చేశారు. ఏడు మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులతో ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ మంత్రి సభ విజయవంతానికి కృషిచేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.
-హుస్నాబాద్, మే 4
హుస్నాబాద్, మే 4: ఒకప్పుడు కరువు కాటకాలతో అల్లాడిన హుస్నాబాద్ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతున్నది. సీఎం కేసీఆర్‌కు సెం టిమెంట్ గల నియోజకవర్గం కావడం, మంత్రులు కె.తారకరామారావు, తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ల ప్రత్యేక కృషితో హుస్నాబాద్‌లో ప్రగతి పరుగులు పెడుతోంది. ఒకప్పటి హుస్నాబాద్‌కు ఇప్పటి హుస్నాబాద్‌కు ఆస్మాన్ ఫరక్ ఉందని పలువురు మేధావులు సైతం చర్చించుకోవడం విశేషం. హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం ఇచ్చేందుకు శుక్రవారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖమంత్రి కె.తారకరామారావు హుస్నాబాద్‌లో తొలిసారి పర్యటించనున్నారు. ఆయన పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. హుస్నాబాద్ పట్టణం మొత్తం గులాబీమయం అయింది. ఆర్టీసీ డిపో సమీపంలోని గ్రౌండ్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ వేదికను ఏర్పాటు చేశారు. మంత్రి ప్రారంభించబోయే, శంకుస్థాపన చేయబోయే ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పా ట్లు చేశారు. మినీ స్టేడియం లో హెలీప్యాడ్ సిద్ధంగా ఉంది. ఎమ్మెల్యే సతీ శ్ కుమార్ ఏడు మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ మంత్రి పర్యటన విజయవంతం కోసం కృషి చేస్తున్నారు.
గులాబీమయమైన పట్టణం.. బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు
మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా హుస్నాబాద్ పట్టణం గులాబీమయం అయింది. డిపో గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదిక వద్ద భారీగా ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతం మొత్తం సీఎం కేసీఆర్, మంత్రుల కటౌట్లు ఆకట్టుకుంటున్నాయి. ఒకవేళ వర్షం వచ్చినా సభకు వచ్చిన ప్రజలు, పార్టీ శ్రేణులకు ఇబ్బంది కలుగకుండా సభాప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి రోడ్డు మార్గం ద్వారా పర్యటించే ప్రాంతాల్లో గులాబీ జెండాలు, ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లను గులాబీ జెండాలతో అలంకరించారు. మంత్రి ప్రారంభించబోయే భవనాలు, శంకుస్థాపన చేయబోయే ప్రాంతాల్లోనూ ప్రత్యేక ఏర్పా ట్లు చేశారు. పట్టణంలోని దాదాపు అన్ని వార్డుల్లోనూ గులాబీ జెండాలతో అలంకరణ చేశారు. బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి 5 వేలకుపైగా జన సమీకరణ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఇప్పటికే రూ.34 కోట్ల నిధులతో అభివృద్ధి .. మరో రూ. 60 కోట్లకు ప్రతిపాదనలు
హుస్నాబాద్ పట్టణ అభివృద్ధికి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికే రూ.34 కోట్ల నిధులు మంజూరు చేయగా, పట్టణంలో సీసీరోడ్లు, డ్రైనేజీలు దాదాపుగా పూర్తి కావచ్చాయి. పట్టణంలో ఏ కాలనీ చూసినా సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతో కళకళలాడుతున్నాయి. మరో రూ.60 కోట్ల పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి మంత్రికి ఇవ్వనున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్ తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులైన డిపో రోడ్డు, నాగారం రోడ్డు, రామవరం రోడ్లలో సెంట్రల్ లైటింగ్ సిస్టం, డివైడర్ల ఏర్పాటు, బైపాస్ రోడ్డు నిర్మాణం, అన్ని కుల సంఘాలకు కమ్యూనిటీ హాళ్లు, ఇంకా మిగిలి ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరనున్నట్లు ఆమె చెప్పారు. ఐటీ హబ్, ఇండస్ట్రియల్ కారిడార్ హుస్నాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని మంత్రిని కోరనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇవి మంజూరైతే హుస్నాబాద్ పట్టణ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి.
రూ.33.51 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
మంత్రి కేటీఆర్ హుస్నాబాద్ పట్టణంలో రూ.33.51 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.2.25 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం, రూ.కోటితో నిర్మించిన ఎస్టీ ఉమెన్స్ హాస్టల్ భవనం, రూ.2 కోట్లతో నిర్మించిన టీచర్ ట్రైనింగ్ సెంటర్ భవనం, రూ.10 లక్షలతో నిర్మించిన బస్తీ దవాఖాన భవనం, రూ.16.46 లక్షలతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రూ.1.20 కోట్లతో నిర్మించిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, రూ.కోటి నిధులతో నిర్మించిన ఇండోర్ స్టేడియం మంత్రి ప్రారంభిస్తారు. రూ.3.50 కోట్లతో ఎల్లమ్మ చెరువు ఆధునీకరణ పనులు, రూ.2 కోట్లతో నిర్మించబోయే ధోబీఘాట్, రూ.2.50 కోట్లతో నిర్మించబోయే హుస్నాబాద్ సబ్‌స్టేషన్ నుంచి మహ్మదాపూర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారు.
బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావాలి
రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమలు, చేనేత శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు మొట్టమొదటి సారి హుస్నాబాద్ పట్టణానికి వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి అధిక సంఖ్య లో ప్రజలు, పార్టీ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలి. మంత్రి కృషితో పట్టణంతోపాటు చుట్టుపక్కల మండలాల్లో ఎంతో అభివృద్ధి జరిగింది. హుస్నాబాద్‌లో ఆయ న పర్యటనతో ఇంకా అభివృద్ధి పనులు ఊపందుకోనున్నాయి. పెద్ద సంఖ్యలో హాజరై మంత్రికి ఘన స్వాగతం పలికి హుస్నాబాద్ ప్రాంతానికి కావాల్సిన నిధులు, చేయాల్సిన పనులను వివరిస్తాం. హుస్నాబాద్ ప్రాంతంలో బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ చదివిన విద్యార్థులు వందలాది మంది ఉన్నారు. వీరికోసం హుస్నాబాద్‌లో ఐటీహబ్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరుతాం. నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత యువతకు ఉపాధి కల్పించే అవకాశం ఉన్నందున ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని మంత్రికి ప్రతిపాదనలు ఇస్తాం. మంత్రి కృషితో ఇవి మంజూరైతే ఈ ప్రాంత యువత జీవితాల్లో వెలుగులు నింపినట్లవుతుంది. బహిరంగ సభకు 50 వేలకు పైగా ప్రజలు తరలి రానున్నారు.
-వొడితెల సతీశ్‌కుమార్, ఎమ్మెల్యే, హుస్నాబాద్
ఉదయం 11.35 గంటలకు బహిరంగ సభ ప్రారంభం
మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం 10 గంటలకు హుస్నాబాద్ పట్టణంలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద హెలీకాప్టర్‌లో ల్యాండ్ అవుతారు. 10.30 గంటలకు మినీస్టేడియంలో ఏర్పాటు చేసిన డిగ్రీ కళాశాల భవనం, ఇండోర్ స్టేడియం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఎస్టీ ఉమెన్స్ హాస్టల్ భవన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. 11 గంటలకు మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన టీచర్ ట్రైనింగ్ సెంటర్, బస్తీ దవాఖాన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. 11.15 గంటలకు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభిస్తారు. 11.20 గంటలకు ఎల్లమ్మ చెరువు ఆధునీకరణ పనులు, ధోబీఘాట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. 11.35 గంటలకు డిపో గ్రౌండ్లో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగసభ ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మినీ స్టేడియంలో భోజన కార్యక్రమం ఉంటుందని, 2.30 గంటలకు హెలీకాప్టర్‌లో హన్మకొండ జిల్లా పర్యటనకు మంత్రి బయలుదేరుతారని ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ తెలిపారు. బహిరంగ సభకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల పరిధిలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారని ఆయన చెప్పారు.