మెదక్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): బతుక మ్మ పండుగ మన సంస్కృతికి ప్రతీక అని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో సోమవారం మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో బతుకమ్మ ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, సీతక పాల్గొన్నారు. మంత్రులు మహిళలు, యువతులతో కలిసి బతుకమ్మ ఆడారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ..తెలంగాణ ఆడపడుచు లు ఎంతో భక్తి శ్రద్ధలతో బతుకమ్మ జరుపుకుంటారన్నారు. ప్రకృతితో మమేకమయ్యే పండుగ బతుకమ్మ అని కొనియాడారు. ప్రపంచంలో పూలను పూజించే సంస్కృతి తెలంగాణలో మాత్రమే ఉందన్నారు. అనంతరం సింగర్ మంగ్లీ పాడిన బతుకమ్మ పాటలు అలరించాయి. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరా వు, మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఆర్డీవో రమాదేవి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు.