ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం ఎంతో ముఖ్యమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేటలోని వన్‌టౌన్ పీఎస్‌లో స్నేహిత హెల్ప్‌లైన్ సెంటర్, పోలీస్ హెల్త్ ప్రొఫైల్ (పోలీస్ ఆరోగ్య రక్ష) మెడికల్ క్యాంపుతో పాటు ఆధునీకరించిన సిద్దిపేట రూరల్ పీఎస్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిత్యం శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేసే పోలీసులు ఆరోగ్యంగా ఉండాలని మొదటిసారి సిద్దిపేట నుంచే పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అనారోగ్య సమస్యలను గుర్తించి పోలీస్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేస్తామన్నారు. త్వరలో మెదక్,సంగారెడ్డి జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగేలా కృషిచేస్తున్నామన్నారు.
సిద్దిపేట, జనవరి 5 : ప్రతిఒక్కరికీ ఆరోగ్యం ముఖ్యమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురు వారం సిద్దిపేటలోని వన్‌టౌన్ పీఎస్‌లో స్నేహిత హెల్ప్‌లైన్ సెంటర్, పోలీస్ హెల్త్ ప్రొఫైల్ (పోలీస్ ఆరోగ్య రక్ష) మెడికల్ క్యాంపుతోపాటు ఆధునీకరించిన సిద్దిపేట రూరల్ పీఎస్ భవనాన్ని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, సీపీ శ్వేతతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యం శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేసే పోలీసులు ఆరోగ్యంగా ఉండాలనే మొదటిసారి సిద్దిపేట నుంచే పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. త్వరలో మెదక్,సంగారెడ్డి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పారు. అనా రోగ్య సమస్యలను గుర్తించి పోలీస్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేస్తారన్నారు. పండుగ, సెలవులు లేకుండా నిత్యం పనిచేసేది పీపీపీలు అని, పీపీపీలు అంటే పోలీసులు, పొలిటికల్ నేతలు, ప్రెస్ అని అన్నారు. అందరికీ సెలవులు ఉంటాయని, సెలవులు లేకుండా పనిచేసేది వీరు మాత్రమే అన్నారు.
హెల్త్ ప్రొఫైల్ ద్వారా మూడు కేటగిరీలుగా విభజించి అవసరమైన పరీక్షలు ఉచితంగా నిర్వహించి, మందులు అందజేస్తారని తెలిపారు. రెండేండ్లపాటు ప్రతి మూడు నెలలు, ఆరు నెలలకోకసారి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఇందుకోసం రూ.15 లక్షలు కేటాయించామన్నారు. ప్రభుత్వ దవాఖానలపై నమ్మకం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. హెల్త్ ప్రొఫైల్ ఇచ్చే ముందు కుటుంబ సభ్యుల సమక్షంతో కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు. హైదారాబాద్‌లో కొందరి యువకుల్లో ర్యాండమ్ సర్వే చేస్తే, 70 శాతం మందికి బీపీ, షుగర్ ఉన్నట్లు తేలిందన్నారు. దేశంలోనే నాన్‌వెజ్ ఎక్కువగా తింటున్న రాష్ర్టాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందన్నారు. రాజస్థాన్ ఆఖరి స్థా నంలో ఉందన్నారు. ఎక్కువ మాం సం తినడంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. పోలీస్ కన్వన్షన్ సెంటర్‌ను పోలీసులకు ఉచితంగా శుభాకార్యాలకు ఇవ్వనున్నట్లు తెలిపారు.
పోలీస్ సిబ్బంది సంక్షేమానికి పోలీస్ సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం సీపీ శ్వేత మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియని పరిస్థితి అని, దీంతో పనిఒత్తిడి పెరిగి అనారోగ్యం బారిన పడకుండా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకునే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పైలెట్ ప్రాజెక్టు సక్సెస్ కావడానికి ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి మహిళా కోఆర్డినేటర్‌ను నియమిస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజులారాజనర్సు, వైస్ చైర్మన్ కనకరాజు, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) మహేందర్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ విమలాథామస్, డీఎంహెచ్‌వో డాక్టర్ కాశీనాథ్, నర్సింగ్ కౌన్సిల్ మెంబర్ పాల సాయిరాం, నాయకులు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రామచందర్‌రావు, కౌన్సిలర్ సాయిశ్వర్గౌడ్తో పాటు పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రూరల్ పీఎస్‌ను ప్రారంభించిన మంత్రి
సిద్దిపేట రూరల్, జనవరి 5 : ఆధునీకరించిన సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని గురువారం ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం స్టేషన్‌లోని గదులను పరిశీలించారు. గతంలోని పాత భవనంలో సిబ్బంది విధులు నిర్వర్తించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో పాత భవనం వెనుకభాగంలోని భవనాన్ని ఆధునీకరించి అందుబాటులోకి తెచ్చారు. అనంతరం సిబ్బందితో కాసేపు మాట్లాడారు. సిబ్బంది విశ్రాంతి తీసుకునేందుకు నిర్మించిన విశ్రాంతి గదిని సీపీ శ్వేత పరిశీలించారు. అంతకుముందు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న మంత్రికి సీఐ జానకీ రాంరెడ్డి, ఎస్సై కిరణ్‌రెడ్డి మొక్కతో స్వాగతం పలికారు. ప్రారంభోత్సవంలో జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, సీపీ శ్వేత, ఏసీపీ దేవారెడ్డి, జడ్పీటీసీ శ్రీహరిగౌడ్, ఎంపీపీ శ్రీదేవీరామచందర్రావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
స్నేహిత సహాయక సెంటర్ ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ఉమెన్ సేఫ్టీ వింగ్‌ను ఏర్పాటు చేసి షీటీమ్స్, భరోసా, డయల్ 100 లాంటి హెల్ప్‌లైన్ ద్వారా మహిళలు, బాలికలపై జరుగుతున్న వేధింపులను ఈవ్‌టీజింగ్, గృహ హింసను అరికట్టే దిశగా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులను అరికట్టే దిశగా మరో ముందడుగు వేసినట్లు చెప్పారు. గృహహింస నుంచి మహిళలను రక్షించేందుకు స్వార్డ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా స్నేహిత మహిళా సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.