రైతు రాజ్యమిది
సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే తెలంగాణలో రైతన్నలు గెలిచి, నిలిచారని, ప్రతి గుంటకూ సాగునీరు.. ప్రతి రైతు గుం డెల్లో సీఎం కేసీఆర్ ఉన్నారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. వడగండ్లతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు అందిస్తున్నారన్నారు.
- కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గానికి 200 స్ప్రింకర్లు ఇస్తే..
- మేము గ్రామానికి 200 సెట్లు అందిస్తున్నాం..
- ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు
సిద్దిపేట, మార్చి 26 : సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే తెలంగాణలో రైతన్నలు గెలిచి, నిలిచారని, ప్రతి గుంటకూ సాగునీరు.. ప్రతి రైతు గుం డెల్లో సీఎం కేసీఆర్ ఉన్నారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. వడగండ్లతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు అందిస్తున్నారన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని వ్యవసాయ మార్కె ట్ కమిటీ ఆవరణలో ఎమ్మెల్సీ పారూఖ్ హుస్సేన్, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మతో కలిసి బిందుసేద్యం ద్వారా వ్యవసాయం చేస్తున్న 763 మంది రైతులకు స్ప్రింక్లర్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గంలో 4367 స్ప్రింకర్ల సెట్లను అందజేశామన్నారు. రైతుల గురించి బీజేపీ నేతలు మాట్లాడమంటే దెయ్యాలు, వేదాలు వల్లించినట్లు ఉందని, నల్ల చట్టాలు తెచ్చి 800 మంది రైతుల ఉసురు తీసిందని మండిపడ్డారు.
కేంద్ర ప్రభు త్వం మరోసారి యాసంగి వరి పంట కొనమని చేతులెత్తేసిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిగింజా కొంటామని చెప్పారని, రైతులను సీఎం కేసీఆర్ ఓదార్చితే, బీజేపీ వంకర మాటలు మాట్లాడుతున్నదని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడ చూసినా తెలంగాణ తరహా పాలన, సంక్షేమ పథకాలు కావాలని ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. వడగండ్లకు నష్టపోయిన పం టకు సీఎం కేసీఆర్ ఎకరాకు రూ.10వేలు ప్రకటిస్తే, రూ.10వేలు చాలవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, రైతులపై ప్రేమ ఉంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ యాసంగిలో దేశంలో మొత్తం 97 లక్షల ఎకరా ల్లో వరి సాగు అయితే, తెలంగాణలోనే 56 లక్షల ఎకరాలు సాగు అవుతున్నదని, రైతు బిడ్డ సీఎం కేసీఆర్ ముందు చూపుతో వ్యవసాయంలో తెలంగాణ రైతు గెలిచి నిలిచాడన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు తప్ప చేతలు ఉండవన్నారు. కాళేశ్వరం నీళ్లు కాల్వల్లో పారడం లేదంటున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలను ఆ కాల్వల్లో ముంచితే పారుతున్నాయా.. లేదా తెలుస్తున్నదని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో నియోజకవర్గానికి 200 స్ప్రింకర్లు సెట్లు ఇచ్చారని, నేడు ఊరికి 200 సెట్ల ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజల కోసం గంజి కేంద్రాలు, పశువుల కోసం గడ్డి కేంద్రాలు పెట్టిన రోజులున్నాయన్నారు. రైతుల కోసం పనిచేసే సీఎం కేసీఆర్ వెంట రైతులు ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ మచ్చ విజితావేణుగోపాల్రెడ్డి, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఎంపీపీలు కూర మాణిక్యరెడ్డి, బాలకృష్ణ యాదవ్, జాప శ్రీకాంత్‌రెడ్డి, ఉద్యానవన శాఖాధికారి రామలక్ష్మితో పాటు ఆయా మండలాల నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

