దుబ్బాక/మిరుదొడ్డి, నవంబర్ 30: అక్బర్పేట-భూంపల్లి మండల కేంద్రంలో బుధవారం నూతన తహసీల్ కార్యాలయాన్ని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సమావేశం ముగించుకొని ప్రజలతో కలిసి అక్కడి నుంచి నూతన తహసీల్ కార్యాలయం వరకు మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బొంపల్లి మనోహర్‌రావు, సోలిపేట సతీశ్‌రెడ్డి, మామిడి మోహన్‌రెడ్డి, వెంకట నర్సింహారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య,దుబ్బాక నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీలు, ఆత్మ కమిటీ చైర్మన్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా వెళ్లారు.
నూతన తహసీల్ కార్యాలయం వద్ద కలెక్టర్ ప్రాశాంత్ జీవన్ పాటిల్ పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. మంత్రి తన్నీరు హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి మంత్రి నూతన తహసీల్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. కార్యక్రమంలో అక్బర్పేట సర్పంచ్ ధర్మారం స్వరూప భిక్షపతి, భూంపల్లి సర్పంచ్ బక్కి భాగ్యమ్మ వెంకటయ్య, సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డి, మిరుదొడ్డి, దుబ్బాక మండలాల ప్రజా ప్రతిప్రతి నిధులు, తహసీల్దార్లు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.ప్రజల కోరిక నెరవేరింది..
రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి ప్రజల ఆకాంక్ష మేరకు అక్బర్పేట-భూంపల్లి నూతన మండలాన్ని ఏర్పాటు చేసింది. నూతన మండల ఏర్పాటుతో పాలన చేరువై ప్రజలకు మేలు జరగనున్నది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కృతజ్ఞతలు. – బక్కి భాగ్యలక్ష్మీ వెంకటయ్య, భూంపల్లి సర్పంచ్
ఏండ్ల నాటి బాధలు తీరాయి
ఎన్నో ఏండ్ల నాటి నుంచి మిరుదొడ్డి వెళ్లడానికి ఇబ్బందులు పడ్డాం. మిరుదొడ్డికి వెళ్లాలంటే ఒకరోజు పని పోయేది. ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. మాకు మండలం కావడంతో పనులు సకాలంలో పూర్తి చేసుకోవచ్చు. ప్రజలు బాధలు తీర్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– ధర్మారం స్వరూప భిక్షపతి, సర్పంచ్ అక్బర్పేట.
మా కష్టాలను తీర్చిన దేవుడు కేసీఆర్
సీఎం కేసీఆర్ అక్బర్పేట-భూంపల్లి మండలాన్ని ఏర్పాటు చేసి మా కష్టాలను తీర్చారు. నూతన మండలం అన్నిరంగాల్లో అభివద్ధిని సాధించడానికి అవకాశం ఉంది, నూతనంగా మండలాన్ని ఏర్పాటు చేసి చుట్టు పక్కల గ్రామాల ప్రజల గుండెల్లో సీఎం కేసీఆర్ దేవుడిగా కొలువయ్యారు.
– దుంపలపల్లి నర్సాగౌడ్, రైతు, నగరం గ్రామం
ప్రభుత్వానికి కృతజ్ఞతలు..
నూతన మండలాన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ మేమంతా రుణపడి ఉంటాం. మండలం ఏర్పాటుతో దూర భారం తగ్గి ఆయా గ్రామాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి మా కృతజ్ఞతలు.
– బాల్తే వెంకటేశం, రైతు, అక్బర్పేట