హత్నూర, అక్టోబర్ 24: ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలు అందించడానికి కృషి చేస్తున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. హత్నూర మండలం దౌల్తాబాద్‌లో రూ.1.56 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని గురువారం మంత్రి కొండా సురేఖ, టీజీఐసీసీ చైర్మన్ నిర్మలాజగ్గారెడ్డి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ..నర్సాపూర్-సంగారెడ్డి ప్రధాన రహదారిపై తరుచూ రోడ్డుప్రమాదాలు చోటుచేసుకుంటుండటంతో అత్యవసర వైద్యసేవలు అందించడంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. దౌల్తాబాద్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని 30 పడకల దవాఖానగా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధ్దం చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.
మంత్రి కొండా సురేఖ మాట్లాడు తూ.. విద్య, వైద్యం, పర్యావరణం తదితర ఆంశాలపై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిపారు. ఎమ్మె ల్యే సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. దౌల్తాబాద్ ప్రభు త్వ దవాఖాన భవనం శిథిలావస్థకు చేరడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1.56 కోట్ల నిధు లు మంజూరు చేసి భవనం నిర్మాణ పనులు పూర్తిచేయగా, ప్రారంభించుకోవడం సంతోషంగా ఉం దని తెలిపారు.
దౌల్తాబాద్ దవాఖాన భవ నం ప్రారంభోత్సవంపై ఎందుకు సమాచారం ఇవ్వలేదంటూ జిల్లా వైద్యాధికారి గాయత్రిదేవిపై ఎమ్మె ల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధ్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసినిరెడ్డి, ఆర్డీవో నాగరాజు, తహసీల్దార్ ఫర్హీన్‌షేక్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, లేబర్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, మాజీ ఎం పీపీ నర్సింహు లు, మాజీ సర్పంచ్ వెంకటేశం పాల్గొన్నారు.