అందోల్, ఆగస్టు 6: వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలికవసతులు కల్పిస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సిహ అన్నారు. మంగళవారం సం గారెడ్డి జిల్లా అందోల్‌లోని బాలికల సాంఘిక సంక్షేమ వసతి గృహంలోని విద్యార్థులు, సిబ్బంది, అధికారులతో కలిసి ఆయన మొక్కలు నాటారు.
అనంతరం వసతులు, కల్పించాల్సిన సౌకర్యాలను అగిడి తెలుసుకున్నారు. జోగిపేటలోని వాసవి కల్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వాసవీమాత మండల పూజలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ ఆవరణంలో మొక్క లు నాటారు.
కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర చైర్పర్సన్ సుజాత, ఆర్డీవో పాండు, ఆర్యవైశ్య సం ఘం మహిళా అధ్యక్షురాలు రజిని, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్ రంగసురేశ్, చిట్టిబాబు, డాకూరి శంకర్, రేఖాప్రవీణ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు జూకంటి లక్ష్మణ్, చింతల సు రేశ్, ఎదిరే రమేశ్, రాములు, రఘు, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.