సంగారెడ్డి, నవంబరు 6: బీసీ కుల గణన సర్వేను నిష్పక్షపాతంగా చేపట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని విద్యానగర్ కాలనీలో బుధవారం జిల్లా ఇన్చార్జి మం త్రి కొండా సురేఖతో కలిసి ఎన్యూమరేటర్లు చేస్తున్న ఇం టింటి సర్వేను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ కుల గణనతో ప్రభుత్వానికి పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. తద్వారా పథకాలు, కార్యక్రమాల అమలుకు ప్రభుత్వానికి ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా దీనిని చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లాలోని 26 మండలాల్లో 4లక్షలకు పైగా కుటుంబాలు ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో 2.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 1.65లక్షల కుటుంబాలను సర్వే చేస్తామన్నారు.150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్‌తో సర్వే చేయిస్తున్నట్లు తెలిపారు. నెలాఖరులోగా సర్వేను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, మున్సిపల్ అధికారులు, కాలనీవాసులు, నాయకులు పాల్గొన్నారు.
అందోల్, నవబంర్ 6: ప్రభుత్వం చేపడుతున్న ఇం టిం టి కులగణన సర్వేను పకడ్బందీగా చేపట్టాలని వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి దామోద రాజనర్సింహ అన్నా రు. అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలోని 17, 18, 19 వార్డుల్లో పలువురి ఇం డ్లకు వెళ్లి సమగ్ర కుటుంబ కులగణన సర్వేను ప్రారంభించి స్వయంగా డోర్లకు స్టిక్కర్లను అతికించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కులగణన సర్వేకు ప్రజలందరూ సహకరించి పూర్తి వివరాలు అందజేయాలని కోరారు.
అంతకుముందు అందోల్ శివారులో నర్సింగ్ కళాశాల ఏర్పాటు కోసం జరుగుతున్న పనులను మంత్రి పరిశీలించి సూచనలు చేశారు. మంత్రి వెంట అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవో పాండు, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, డీటీ మధుకర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వైస్ ర్మన్ ప్రవీణ్, కౌన్సిలర్లు సురేందర్‌గౌడ్, చిట్టిబాబు, నాగరాజు, దుర్గేశ్, సురేశ్, శంకర్, చెందర్నాయక్, మర్వెల్లి సంగమేశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, శరత్‌బాబు, శివ, సందీప్‌గౌడ్, అనిల్‌రాజ్, లక్ష్మణ్, శేఖర్ ఉన్నారు.