పాపన్నపేట, మే 1 : ఈ నెల 2వ తేదీ నుండి 16వ తేదీ వరకు నిర్వహించే సమ్మర్ క్యాంపును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి ప్రతాపరెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన మాట్లా డుతూ.. ఆరో తరగతి నుండి 9వ తరగతి వరకు చదివే బాల బాలికలలు ఈ క్యాంపుకు అర్హులన్నారు. ఈ క్యాంపులో డ్రాయింగ్, క్రాఫ్ట్, కరాటే, కుట్లు, అల్లకం, డ్యాన్స్, వివిధ రకాల ఆట పాటలు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనునట్లు ఆయన వెల్లడించారు.
15 రోజులపాటు కొనసాగే ఈ క్యాంప్ పాపన్నపేట ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తామన్నారు. ఈ క్యాంపుకు హాజరయ్యే విద్యార్థులకు స్నాక్స్ తో పాటు మంచినీటి సౌకర్యం కల్పించనునట్లు ఆయన వివరించారు. మిగతా వివరాలకు 8500200859 నెంబర్ను సంప్రదించాల్సిందిగా ఆయన సూచించారు.