ఆడపిల్లలకు అండగా ఉండాలి
సమాజంలో ఆడపిల్లలకు ప్రతి ఒక్కరూ భరోసా, ధీమా కల్పించాలని మెదక్ ఎస్పీ రోహణి ప్రియదర్శిని అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మంబోజిపల్లిలోని గీతా ఉన్నత పాఠశాలలో మహిళాశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎస్పీ రోహణి ప్రియదర్శిని, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమసింగ్ హాజరై జ్యోతి ప్రజ్వాలన చేశారు.
- మెదక్ ఎస్పీ రోహణి ప్రియ దర్శిని
- ప్రతి ఒక్కరూ భరోసా, ధీమా కల్పించాలి
- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్‌రూరల్, జనవరి 24: సమాజంలో ఆడపిల్లలకు ప్రతి ఒక్కరూ భరోసా, ధీమా కల్పించాలని మెదక్ ఎస్పీ రోహణి ప్రియదర్శిని అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మంబోజిపల్లిలోని గీతా ఉన్నత పాఠశాలలో మహిళాశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎస్పీ రోహణి ప్రియదర్శిని, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమసింగ్ హాజరై జ్యోతి ప్రజ్వాలన చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమజంలో ఆడపిల్లల పట్ల వివక్షతను తొలిగించి వారిని కాపాడు కోవాలన్నారు. యుక్త వయసులో ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా విద్యావకాశాలను అందిపుచ్చుకోని పురుషులతో పాటు మహిళాలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. బాలికలు లక్ష్యాన్ని నిర్ధేశించుకుని విలువలతో కూడిన నాణ్యమైన విద్యతో పాటు, సమాజంలో చక్కని నడవడిక, ప్రవర్తనతో మెలగాలన్నారు.
మహిళాలకు ఇబ్బందులు ఏర్పడితే 100కు డయల్ చేయాలన్నారు. అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మా ట్లాడుతూ మహిళాల సంక్షేమం కోసం ప్రభు త్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని వా టిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రా ణించడానికి మహిళాల రక్షణ సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. జిల్లా యంత్రాంగం తరుపున పూర్తి సహాయసహకారాలు అందించి సమాజంలో ఆర్థికంగా నిలదొక్కుకునేలా చక్కటి వేదిక కల్పిస్తామన్నారు. బాలికలు సా మాజిక సమస్యలపై అవగాహన పెంచుకోవాలన్నా రు. మహిళలు తనంతట తాము అన్ని విషయాల్లో సొంతంగా నిర్ణయా లు తీసుకున్ననాడే మహిళా సాధికారత వచ్చినట్లని అన్నారు. లింగ వివక్షను వీడి సమానత్వాన్ని మన ఇంటినుం చే మొద లు పెట్టాలన్నారు. అంతకు ముందు పాఠశాల విద్యార్థుల, చిత్రలేఖనం, ముగ్గుల పోటీలు వ్యాస రచన, నృత్యగీతాలు ప్రదర్శించిన వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా నేషనల్ గర్ల్ చైల్డ్ డే బ్రోచర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి బ్రహ్మజీ డీఈ వో రమేశ్ కుమార్ జిల్లా వైద్యాధికారి చందునాయక్, ఎంఈ వో నీలకంఠం, గీతా స్కూల్ ప్రధానాచార్యులు మాధవీ రామాంజనేయులు, సీడీపీవో ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

