మెదక్ రూరల్, అక్టోబర్ 15 : మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం బాల్య వివాహాలు లేని జిల్లాగా కావటానికి గాను దేవాలయాల్లో బాల్య వివాహాలు జరగకుండా నోటీస్ బోర్డులను ఏర్పాటు చేయుటకు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తయారుచేసిన గోడ పత్రికను కలెక్టర్ రాహుల్ రాజ్, టీడబ్ల్యూవో హేమ భార్గవితో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో ఇక నుంచి బాల్య వివాహాలు జరగకూడదని, అందుకోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పని చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజన్ సంస్థ డైరెక్టర్ వంగరీ కైలాస్, సంస్థ జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ రాజు, సిబ్బంది యాదగిరి, సంజీవ్, నవనీత మొదలగు వారు పాల్గొన్నారు.