సిద్దిపేట టౌన్, సెప్టెంబర్ 9: రేవంత్‌రెడ్డి పాలన గాడి తప్పిందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. సోమవా రం సిద్దిపేట ఎన్జీవోస్ భవన్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయ న ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ.. వినాయక చవి తి సమయంలో పోలీస్ కానిస్టేబుల్‌ను కూడా బదిలీ చేయరు. కా నీ, పోలీస్ కమిషనర్లను మార్చతున్నారన్నారు.
ఎం ఐఎం, అసదుద్దీన్ మెప్పు కోసం హైదరాబాద్ సీపీని ట్రాన్స్ఫర్ చేశారని ఆగ్ర హం వ్యక్త చేశారు. హైడ్రా రాజకీయాల కోసం కాకుండా ప్రకృతి పరిరక్షణకు పనిచేయాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా చట్టంలో మార్పులు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. హైడ్రాలో ఏ విధమైన మార్పులు చేయకుండా యాథావిధిగా కొనసాగించాలని సూచించారు. బీజేపీ సా మాన్య కార్యకర్తను కూడా నాయకుడిగా ఎదిగేలా ప్రోత్సహిస్తుందన్నారు.
దేశ అవసరాల కోసం ప్రధాని మోదీ నూతన చట్టాలను తెచ్చారన్నారు. దేశ సంస్కృతిని కాం గ్రెస్, కమూనిస్టు పార్టీలు తుంగలో తొ క్కాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహ న్‌రెడ్డి, నాయకులు సుభాష్‌చందర్, శం కర్, రామచందర్‌రావు, గోనే మార్కండేయులు, బాలేశ్‌గౌడ్, విభీషణ్‌రెడ్డి, గురువారెడ్డి, ఉపేందర్‌రావు, నరేశ్ తదితరు లు పాల్గొన్నారు.