దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్-సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నియామకమయ్యారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు ఆమె పదవిలో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, స్పీకర్ శ్రీనివాస్‌రెడ్డిలకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
– మెదక్ మున్సిపాలిటీ, మార్చి 10