మెదక్ అర్బన్/ తూప్రాన్/ అల్లాదుర్గం/ పెద్దశంకరంపేట/ చేగుంట, సెప్టెంబర్ 27 : విద్యార్థులే దేశ భవిష్యత్, వారే జాతి సంపద అని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాల ని పిలుపునిచ్చారు. మెదక్ పట్టణంలోని ప్రభుత్వ జూనియ ర్ కళాశాల మైదానంలో స్కూల్ గేమ్స్ పెడరేషన్ ఆధ్వర్యం లో నాలుగు రోజులుగా జిల్లాస్థాయి ఖోఖో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. బుధవారం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అథితిగా ఎమ్మెల్యే హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయని, క్రీడల పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపాలని కోరారు. చదువు విజ్ఞానాన్ని పెంచితే, క్రీడలతో శారీరకంగా ఆరోగ్యంగా ఉంటామన్నారు. పోటీల్లో గెలుపు, ఓటమి సమానమని, ఓడిపోతే బాధపడకుండా ముందుకు వెళ్తే గెలుపు సొంతమవుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్‌పర్సన్ లావ ణ్యారెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గంగాధర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నదని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో ఉర్దూ, తెలుగు మీడియం ప్రభుత్వ జూనియ ర్ కళాశాలకు చెందిన 42 మంది విద్యార్థులకు బ్యాగులను అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌గౌడ్, ఇన్చార్జి ప్రిన్సిపాల్ మధుసూదన్‌రావు, లెక్చరర్లు శేఖర్, మల్లయ్య, వెంకటేశం, ఉస్మాన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
విద్యతోనే ప్రపంచాన్ని జయించవచ్చని ఆర్డీవో జయచంద్రారెడ్డి, నలంద కళాశాల కరస్పాండెంట్ వెంకటరమణ అన్నారు. తూప్రాన్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఫ్రెషర్స్ డే నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, కళాశాల ఇన్‌చార్జ్జి రవి, విద్యార్థులు పాల్గొన్నారు.
అల్లాదుర్గం, పెద్దశంకరంపేట మండలకేంద్రాల్లో విద్యార్థులు ‘మేరా మట్టి మేరా దేశ్’లో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో హెచ్ఎంలు ధనుంజయ, రవి కుమార్, వెంకటేశం, రాజేశ్వర్, రామకృష్ణాగౌడ్, టీచర్లు నరేందర్‌గౌడ్, ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్‌రావు, అర్జున్, తపాలాశాఖ సిబ్బంది తుకారం పాల్గొన్నారు. చేగుంటలో జరిగిన కార్యక్రమంలో చేగుంట జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం నీరజ, ఎంపీటీసీ వెంకటలక్ష్మీరఘురాములు, టీచర్లు సుధాకర్‌రెడ్డి, రాజేశ్వర్, వెంకటేశ్, రఘుపతి, రాథోడ్ శంకర్‌సింగ్, రాధ, సరస్వతీ, పద్మజ, మాధవి, లలిత ఉన్నారు.