నిజాంపేట,ఫిబ్రవరి21 : వరి ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రాలకు తరలించాలని మండల ఏవో సోమలింగారెడ్డి రైతులకు సూచించారు. శుక్రవారం నిజాంపేట రైతువేదికలో యాసంగి వరి కోతల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల ఏవో సోమలింగా రెడ్డి మాట్లాడుతూ.. వరి కోత సమయంలో హార్వెస్టర్ ఫ్యాన్ బెల్ట్ వేగం 18-20 ఆర్పీఎం ఉండాలని తెలిపారు. దానివల్ల ధాన్యంలో తాలు గింజలు రాకుండా నివారించబడుతుందని పేర్కొన్నారు. ధాన్యం తేమ శాతం 17 లోపు ఉండాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఏఈవోలు శ్రీలత, రమ్య, రైతులు కంది రాజరాం, టంకరి లక్ష్మణ్, భాస్కర్ నాయక్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.