చేగుంట/ రామాయంపేట/ మెదక్ రూరల్/ పెద్దశంకరంపేట/ చిన్నశంకరంపేట/ శివ్వంపేట, జూలై 10 : ఆషాఢ మాసం తొలి ఏకాదశి పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా ఆల యాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిం చారు. చేగుంట, నార్సింగి మండలాల్లోని పలు గ్రామాల్లో తొలి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చేగుంట మండలకేంద్రంలో ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి ఆధ్వర్యం లో మహిళలు మైదాకు పెట్టుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. చేగుంట మండల కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి, శివపంచాయత హనుమాన్ దేవాలయం, కర్నాల్పల్లిలోని భక్తంజనేయ, షిర్డీ సాయిబాబా, చిన్నశివునూర్లోని హనుమాన్ ఆలయంతోపాటు నార్సింగి మండలంలోని పలు ఆలయాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షను ఆచరించి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.
రామాయంపేట అయ్యప్ప ఆలయంలో హోమాలు
రామాయంపేట పట్ట్టణంతోపాటు మండల వ్యాప్తంగా తొలి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని వివిధ దేవాలయాల్లో పూజారులు ఉత్సవమూర్తులను పూల తో అలంకరణ చేసి మంగళహారతులు, నైవేధ్యాలు సమర్పించారు. ధర్మారం(డీ)గ్రామంలో భక్తులు ఇండల్లోనే పూజలు చేసి ఉపవాస దీక్షలను విరమించారు. వర్షాలతో ఆలయాలకు వెళ్లలేక భక్తులందరూ ఇండ్లలో పూజలు చేశారు. రామాయంపేటలోని అయ్యప్పఆలయంలో మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, సౌమ్య దంపతులు హోమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. నందిగామలో మున్నూరుకాపు సంఘం నాయకు లు మహంకాళి అమ్మవారికి పూజలు చేశారు. రామాయం పేటలోని ఏడీదుల ఎల్లమ్మకు మహిళలు పూజలు చేశారు.
భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి పూజలు
పెద్దశంకరంపేట మండలంలో ఏకాదశి వేడుకలను ప్రజ లు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెద్దశంకరంపేటలోని వేంకటేశ్వర, విఠలేశ్వర, మాణిక్‌ప్రభు ఆలయాల్లో భక్తులు పూజ లు నిర్వహించారు. ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, తిరుమంజనం, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. దేవాలయాల్లో ఖజ్జూర పండుతో ఉపవాసదీక్ష విరమించారు.
మల్లన్న ఆలయానికి తరలివచ్చిన భక్తులు
మెదక్ మండలం మంబోజిపల్లి శివారులో కొయ్యగుట్ట పై కొలువుదీరిన మల్లికార్జునస్వామి ఆలయంలో పూజారి మ ల్లన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.చిన్నశంకరంపేట మండలంలో ఏకాదశి నిర్వహించారు.
లక్ష్మీనరసింహాస్వామికి ప్రత్యేక పూజలు
శివ్వంపేట మండలం సికింద్లాపూర్ లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడు ధనుంజయశర్మ ఆధ్వ ర్యం లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శశిధర్‌గుప్తా, సర్పంచ్ ఏనుగు సుధాకర్‌రెడ్డి, జూని యర్ అసిస్టెంట్ నర్సింహారెడ్డి, అర్చకులు పాల్గొన్నారు.