పటాన్చెరు, ఏప్రిల్ 27 : ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలని హోంశాఖమంత్రి మహమూద్ అలీ పేర్కొ న్నారు. మంగళవారం పటాన్‌చెరులోని జీఎమ్వార్ కన్వెన్షల్ హాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి దావత్ ఏ ఇఫ్తార్ ( ఇఫ్తార్ విందు)లో మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్ పా ల్గొన్నారు. ఈ సందర్భంగా ఇఫ్తార్ ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి హోంమంత్రి, ఎమ్మెల్సీకి ఖర్జురా పండు తినిపించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడు తూ.. తెలంగాణ సంస్కృతి గంగా జమున తె హజీబ్ అన్నారు. హిందూ, ముస్లిం ఐక్యతకు తెలంగాణ ప్రతీక అన్నారు. కులమతాలకు అ తీతంగా కలసిమెలిసి ఉండడం తెలంగాణలో చూడవచ్చన్నా రు. సీఎం కేసీఆర్ అన్ని మతాల పండుగలకు ప్రాధాన్యత ఇ స్తున్నారనితెలిపారు. మైనార్టీల సంక్షే మానికి శ్రమిస్తామని హామీనిచ్చారు.
హిందు, ముస్లిం సోదరభావానికి ప్ర తీక ఇఫ్తార్ విందులని ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ అన్నారు. ముస్లింల సంక్షేమా నికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇచ్చే ఇఫ్తార్ విందు స్పెషల్ అని, అభివృద్ధిలోనూ పటాన్చెరు ముందుందన్నారు.
అన్నివర్గాల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ఇ ఫ్తార్ విందు ఇవ్వడం అదృష్టంగా భావిస్తానన్నారు. ఈద్గాలు, దర్గాలు, మసీదులను కొత్తగా నిర్మించడంతో పాటు మరమ్మతులు చేయిస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మెటివేషనల్ స్పీకర్ రెహమాన్, డీఎస్పీ భీంరెడ్డి, సీఐ వేణుగోపాల్‌రెడ్డి, జడ్పీటీసీలు సుధాకర్‌రెడ్డి, సుప్రజావెంకట్‌రెడ్డి, కుమార్‌గౌడ్, ఎంపీపీలు సుష్మశ్రీ, దేవానంద్, విజయప్రవీణ, కార్పొరేటర్లు కుమార్‌యాదవ్, పుష్పానగేశ్, సింధూఆదర్శ్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్లు లలితాసోమిరెడ్డి, రోజాబాల్రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, నేతలు శ్రీశైలంయాదవ్, అంజయ్య, కృష్ణమూర్తి, శ్రీధర్‌చారి, అబ్దుల్ ఘనీ, మెరాజ్‌ఖాన్, మధుసూధన్‌రెడ్డి, వంగరి అశోక్, విజయ్‌కుమార్, దశరథరెడ్డి, వెంకట్‌రెడ్డి, అఫ్జల్, సత్తార్ మియా, లియాకత్ అలీ, హూస్సేన్, యూ నుస్, రామకృష్ణ, ఆమేర్, వసీం, ఇబ్రహీం, సాబేర్ ఉన్నారు.
సంగారెడ్డి అర్బన్, ఏప్రిల్ 26 : తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాలకు ప్రాధాన్యతనిస్తూ అందరి సంక్షేమానికి పాటుపడుతున్నదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొ న్నారు. రంజాన్ పురస్కరించుకొని మంగళవారం సంగారెడ్డి టీఎన్జీవోస్ భవన్లో అధికారికంగా ఇఫ్తార్ విందు ఏ ర్పాటు చేశారు. విందుకు ఎంపీతో పాటు టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, అధికారులు పాల్గొన్నారు. ముస్లింలు ప్రా ర్థనలు చేసిన అనంతరం విందు ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అన్ని పండగలను అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలవుతు న్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ప్రభుత్వం రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండగలకు నూతన దుస్తులను పంపిణీ చేస్తూ పేదలకు బాసటగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షిషా, ఆర్డీవో నగేశ్, తహసీల్దార్ స్వామి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, సీడీసీ మాజీ చైర్మన్ విజయేందర్‌రెడ్డి, నేతలు షకీల్, రషీద్, ముస్తఫా, అంజాద్ పాల్గొన్నారు.
మనోహరాబాద్, ఏప్రిల్ 26 : మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. కాళ్లకల్‌లోని మదీనా మసీదులో ఇఫ్తార్ విందుకు నిర్వహించారు. విందులో ఎంపీపీ నవనీ తారవి ముదిరాజ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అందోల్, ఏప్రిల్ 26: హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తారతమ్యాలు లేకుండా సోదరాభావంతో పండుగలను నిర్వహించా లని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. విందులో తహసీల్దార్ అశోక్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్, మాజీ ఎంపీపీ రామాగౌడ్ పాల్గొన్నారు.