– మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
హవేళీఘనపూర్, ఏప్రిల్ 25: దళితవర్గాల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ దళితబంధు నిధులు మంజూరు చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పోచమ్మరాళ్ గ్రామంలో దళితబంధు పథకం కింద ఎంపికైన పోచయ్య, శేఖర్, దుర్గేశ్, ప్రభులకు సంబంధించిన పశువుల షెడ్డు, మినీ డెయిరీ ఫామ్ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితబంధు పథకం దేశంలోని ఏ రాష్ట్రంలో చేపట్టలేదన్నారు. ఈ పథకం దేశవ్యాప్తంగా పేరుతెచ్చేలా ప్రతిఒక్కరూ సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో 100 యూనిట్లను దళితులకు మంజూరు చేశారన్నారు. జక్కన్నపేటలో 20 మందిని ఎంపిక చేయగా, అందులో 18 మంది గేదెల షెడ్డూ, మినీ ఫౌల్డ్రీఫామ్ నిర్మించినట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, జడ్పీటీసీ సుజాత శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ హన్మంత్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాప సాయిలు, ఎంపీడీవో శ్రీరామ్, ఎంపీవో ప్రవీణ్, ఆత్మ డైరెక్టర్ కిష్టాగౌడ్, నాయకులు కొంపల్లి సుభాశ్‌రెడ్డి, సిద్దిరెడ్డి, మేకల సాయిలు, నరేందర్‌రెడ్డి, సిద్దిరెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.