మెదక్ న్యూస్ నెట్వర్క్, ఏప్రిల్ 27 : తెలంగాణ ఆవిర్భావ దినత్సోవం వేడుకలను బుధవారం జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహించకున్నారు. ఊరూరా టీఆర్ఎస్ పార్టీ జెండాలను ఆవిష్కరించారు. గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ అధ్యక్షులు, మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్లు తెలంగాణ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలతో పాటు నాలుగు మున్సిపాలిటీల్లో, ఆయా మండలాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని చమన్ చౌరస్తాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అంబరాన్నంటాయి. మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఏఎంసీ చైర్మన్ భట్టి జగపతి, పట్టణ అధ్యక్షుడు గంగాధర్ జెండాను ఆవిష్కరించారు. నవాబుపేటలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ జెండావిష్కరణ చేశారు.
ప్లీనరీకి హాజరైన ఎమ్మెల్యేలు
ప్లీనరీ సమావేశానికి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, వీరితో పాటు మండల నాయకులు, ఎంపీపీలు జడ్పీటీసీలు తరలి వెళ్లారు.