కొల్చారం/ రామాయంపేట/ వెల్దుర్తి, నవంబర్ 25 : అట వీ భూములను సాగు చేస్తున్న రైతులందరికీ పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని అంసాన్పల్లి సర్పంచ్ మన్నె శ్రీనివాస్ పేర్కొన్నారు. కొల్చారం మండలంలోని అంసాన్పల్లి గ్రామం లో శుక్రవారం పోడు భూముల సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. సమావేశానికి ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్,ఆర్ఐ శ్రీహరి హాజరయ్యారు. ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ తన సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా పోడు భూ ములకు దరఖాస్తు చేసుకున్నవారి వివరాలను పంచాయతీ కార్యదర్శులు అంజయ్య, పోచయ్య వివరించారు. మొత్తం 31 మంది దరఖాస్తు చేసుకోగా, ఐదుగురు రైతులు మాత్రమే పం టలను సాగు చేసినట్లు తెలిపారు. దీంతో గ్రామస్తులు మాట్లాడుతూ 20 ఏండ్ల క్రితం గ్రామ శివారులోని అడవిని నరికి భూములను సాగు చేశామని, అప్పట్లో ఫారెస్ట్ అధికారులు కేసులు పెట్టడంతో భూముల్లోకి వెళ్లలేదని వివరించారు. తమ అందరికీ పోడు పట్టాలిప్పించాలని కోరగా, రెవిన్యూ డివిజన్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో సూచించారు. గ్రామసభలో పంచాయతీ పాలకవర్గం, రైతులు పాల్గొన్నారు.
సభకు హాజరుకాని ఫారెస్టు ఆఫీసర్లు
రామాయంపేట మండలం పర్వతాపూర్ పరిధిలోని బాపనయ్య తండాలో పోడుపట్టాలపై గ్రామసభ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఉమాదేవి మాట్లాడుతూ.. అటవీ భూములను సాగు చేస్తున్న రైతులకు మాత్రమే ప్రభు త్వం పోడు భూములకు పట్టాలు ఇస్తు న్నదని పేర్కొన్నారు. బాపనయ్యతండా లో 60మంది రైతులు పోడు భూము లకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. కానీ, సాగులో ఉన్న 39 మంది రైతులకు ప్రభుత్వం పట్టాలను జారీ చేసిందన్నారు. మిగతా 21 మంది రైతులు సాగులో లేర ని పేర్కొన్నారు. సమావేశానికి అటవీశాఖ అధికారులు హాజరు కాలేదు. గ్రామసభలో సర్పంచ్ బోయిని దయాలక్ష్మి, స్వామి, పంచాయతీ కార్యదర్శి, గిరిజనులు పాల్గొన్నారు.
అర్హులైనవారికే పోడుభూముల కేటాయింపు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి పోడుభూములను కేటాయిస్తామని ఎంపీడీవో జగదీశ్వరాచారి అన్నారు. వెల్దుర్తి మండలంలోని శెట్పల్లి, కుకునూర్, మహ్మద్నగర్తండా, దామరంచ, అందుగులపల్లి గ్రామాల్లో పోడుభూములపై గ్రామసభలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలు, కేటాయింపులపై రైతులు, గ్రామస్తులకు అధికారులు అవగాహన కల్పించారు. అర్హులైన ఎస్టీలతోపాటు ఇతరులకు నిబంధనల ప్రకారం అటవీ భూములను ప్రభుత్వం కేటాయిస్తుందని అన్నారు. గ్రామసభలో సర్పంచ్‌లు లత, ప్రీతి, సుజాత, ఎస్సై మధుసూదన్‌గౌడ్, ఎంపీవో విఘ్నేశ్వర్, ఆర్ఐ సందీప్, నాయకులు సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నర్సింహులు, శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రెడ్డితోపాటు రైతులు పాల్గొన్నారు.