మెదక్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి ప్రజలతో మమేకం కావడం ద్వారా ఎంతో విలువైన సమాచారం లభిస్తుందని, అనుభవం వస్తుందని, ఇది ప్రాజెక్ట్ వర్కు ఎంతో దోహదపడుతుందని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రాజెక్ట్ వర్లో భాగంగా శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం నుంచి వారం రోజుల పాటు వివిధ అంశాలపై అధ్యయనం చేసేందుకు వచ్చిన 20మంది ఇండియన్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సర్వీసెస్ అధికారులకు సూచించారు. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్న 2020, 2021, 2022, 2023 బ్యాచ్‌లకు చెందిన 20 మంది ఇండియన్ సర్వీసెస్ అధికారులు జిల్లాలో ఈ నెల 4 నుంచి 10 వరకు నిర్దేశించిన గ్రామాల్లో విడిదిచేసి అకడ అమలవుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను నిశితంగా పరిశీలించి, గ్రామస్తులతో ముఖాముఖి అవుతారు.
ఒకో బ్యాచ్‌లో 5 మంది అధికారుల చొప్పున జిల్లాలో ఎంపిక చేసిన నార్సింగి మండలం వల్లూరు, తూప్రాన్ మండల మలాపూర్, ఇస్లాంపూర్, శివ్వంపేట మండలం ఏదులాపుర్ గ్రామాల్లోని పరిస్థితులను, కార్యక్రమాలపై అధ్యయనం చేస్తారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్‌తో కలిసి కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ మెదక్ జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, ఇకడి ప్రజలు చాలా సౌమ్యులన్నారు. వారితో మమేకమై ప్రజల జీవనస్థితిగతులు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు వాటి సద్వినియోగం వంటి సమాచారంతో పాటు, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వంటి ప్రజోపయోగ సంస్థలు సందర్శించి పనితీరును అధ్యయనం చేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాలను పరిశీలించాలన్నారు. స్వయం సహాయక సంఘాలు మహిళలు నిర్వహిస్తున్న కార్యకలాపాలను అధ్యయనం చేయాలన్నారు. మీకు ఏ సమాచారం కావాలన్నా, ముఖాముఖి కలవాలనుకున్నా, మీకు కేటాయించిన లయజన్ అధికారైన మండల పరిషత్ అభివృద్ధి అధికారిని, పంచాయతీ కార్యదర్శిని సంప్రదిస్తే సమకూరుస్తారని కలెక్టర్ తెలిపారు. తెలుగు సంసృతి, సంప్రదాయ ఆటపాటలైనా బతుకమ్మ, బోనాలు వంటి ప్రదర్శన ఏర్పాటుతో పాటు తెలుగు వంటకాల రుచిని ఇండియన్ సర్వీసెస్ అధికారులకు చూపించవలసినదిగా లైజన్ అధికారులకు సూచించారు. మెదక్ జిల్లాలో ప్రసిద్ధ ప్రాంతాలైన ఏడుపాయల, చర్చి, ఖిల్లా, నర్సాపూర్‌లో అర్బన్ పారును తిలకించవలసినదిగా అధికారులకు సూచించారు. అంతకుముందు జిల్లా సమగ్ర సమాచారం, స్థితిగతులపై డీఆర్డీవో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబ, మండల పరిషత్ అధికారులు, మానవ వనరుల అభివృద్ధి కేంద్ర ప్రాంతీయ శిక్షణా మేనేజర్ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.