మెదక్ మున్సిపాలిటీ, జూన్ 29 : ఆదివారం కావడంతో మెదక్ చర్చి భక్తులు, పర్యాటకులతో కిటకిటలాడింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని యేసయ్యకు మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్బంగా చర్చి ప్రెసిబేటరీ ఇంచార్జి రెవరెండ్ శాంతయ్యతో పాటు ఫాస్టర్లు భక్తులనుద్దేశించి దైవసందేశం చేశారు.
సుదూర ప్రాంతాల నుంచి భక్తులు చర్చి ఆవరణలోని చెట్ల కింద వంటవార్పు చేసుకున్నారు. ప్రార్థనల్లో ఫాస్టర్లు జైపాల్, శ్రీనివాస్, డేవిడ్, చర్చి కమిటీ సభ్యులు గంట సంపత్, సువన్ డగ్లస్, జాన్సన్, సంశాన్ సందీప్, జాయ్ముర్రే తదితరులు పాల్గొన్నారు.