e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home జిల్లాలు అన్ని సదుపాయాలతో వైద్య సేవలు

అన్ని సదుపాయాలతో వైద్య సేవలు

అన్ని సదుపాయాలతో వైద్య సేవలు

ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
నర్సాపూర్‌, మే29: ప్రభుత్వ ఏరియా దవాఖానలో అన్ని సదుపాయాలతో వైద్యసేవలు అందజేస్తున్నామని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తెలిపారు. శనివారం నర్సాపూర్‌ ప్రభుత్వ ఏరియా దవాఖానలో కరోనా చికిత్స తీసుకుంటున్న బాధితులను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర లేబర్‌ వెల్ఫేర్‌ బోర్డు చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఏరియా దవాఖానలో 81 మంది కరోనా బాధితులు అడ్మిట్‌ అయ్యారని, నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మిగతా వారు పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వెళ్లారని తెలిపారు. దవాఖానలో ఆక్సిజన్‌ ట్యాంక్‌ను వారం లోపు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలి:
రాష్ట్ర లేబర్‌ వెల్ఫేర్‌ బోర్డ్డు చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి
ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ వేసుకోవాలని రాష్ట్ర లేబర్‌ వెల్ఫేర్‌ బోర్డు చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు, కౌన్సిలర్‌ అశోక్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, ఆత్మకమిటీ చైర్మన్‌ శివకుమార్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ హబీబ్‌ఖాన్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అశ్రిత్‌కుమార్‌, దవాఖాన సూపరింటెండెంట్‌
పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
రామాయంపేట, మే 29: కరోనాబాధిత కుటుంబాలను రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సరాఫ్‌ యాదగిరి, పీఏసీఎస్‌ చైర్మన్‌ బాదె చంద్రంలు పరామర్శించారు. శనివారం రామాయంపేటలో 30 ఏండ్ల యువకుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న చైర్మన్‌ యువకుడి కుటుంబాన్ని పరామర్శించారు. మండలంలోని రాయిలాపూర్‌ లో కరోనా బారిన పడ్డ కుటుంబాలను సర్పంచ్‌ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు భూమగారి నర్సాగౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు భిక్షపతి ధైర్యం చెప్పారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అన్ని సదుపాయాలతో వైద్య సేవలు

ట్రెండింగ్‌

Advertisement