e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home మెదక్ ఈదురుగాలులతో కూడిన భారీ

ఈదురుగాలులతో కూడిన భారీ

ఈదురుగాలులతో కూడిన భారీ
  • పలుచోట్ల విరిగిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు
  • గాలికి ఎగిరిపోయిన ఇంటిపై రేకులు

విద్యుత్‌ సరఫరాకు అంతరాయంమాయంపేట, మే 14 : రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో జనజీవనం అతలాకుతలమైంది. శుక్రవారం అనుకోకుండా భారీగా గంటపాటు ఏకధాటిగా ఉరుములు, మెరుపులతో వర్షం రావడం రైతులను కుదిపేసింది.కొనుగోలు కేంద్రాల్లోనే ఆరబెట్టుకున్న రైతులకు చెందిన ధాన్యం మొత్తం తడిసి ముద్దయ్యింది. దీంతో చేసేదేమి లేక రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆరుగాలం కష్టపడి విక్రయాలు జరిపే సమయంలో గాలివాన వచ్చి మా పంటంతా నాశనం చేసిందని, మమ్ములను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

తడిసిన ధాన్యం..
చిలిపిచెడ్‌, మే 14 : చిలిపిచెడ్‌ మండలంలో ఫైజాబాద్‌, బండపోతుగల్‌, అజ్జమర్రి, చండూర్‌ తదితర గ్రామాల్లో అకాల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. చిలిపిచెడ్‌లో వరదకు ధాన్యం కొట్టుకుపోయింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈదురుగాలులతో కూడిన భారీ

ట్రెండింగ్‌

Advertisement