సంగారెడ్డి, జూలై 26 : ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఇతర పార్టీల నుంచి వలసలు పెరిగాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం జహీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆధ్వర్యంలో ఆరెకటిక, కాంగ్రెస్ పార్టీల నుంచి హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముచ్చటగా మూడోసారి గెలిచే బీఆర్ఎస్ వైపు నిలబడి మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు నడుంబిగించాలని పిలుపునిచ్చారు.
జహీరాబాద్ నియోజకవర్గం ఆరె కటికలు, కాంగ్రెస్‌ను వీడి మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బుధవారం జహీరాబాద్ నియోజకవర్గం నుంచి స్థానిక ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు తరలివెళ్లారు. వీరిని మంత్రి హరీశ్‌రావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టే బీఆర్ఎస్ తరుఫున నిలిచి మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు నడుంబిగించి పనిచేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలం గాణ అన్ని రంగాల్లో అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. స్వరాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధా న్యత ఇస్తున్నట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కొత్త పథకాలు ప్రారంభించి అందజేస్తు న్న ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీరా మరక్ష గా నిలుస్తుందని గుర్తించి పార్టీలోకి వస్తున్న వారికి స్వాగ తం పలుకుతున్నామన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, నాయకు లు గుండప్ప, ఉమాకాంత్ పాటిల్, విజయ్‌కుమార్ ఉన్నారు.