Child Marriages | కౌడిపల్లి, మార్చి20 : బాల్య వివాహాలు చేస్తే ఎన్నో అనర్థాలు జరుగుతాయని, పెళ్లీడు వచ్చిన తరువాతనే పెళ్లిళ్లు చేయాలని నర్సాపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీవో హెమాభార్గవి తెలిపారు. బుధవారం రాత్రి మండలంలోని తునికి నల్ల పోచమ్మ దేవి జాతరలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా మహిళ శిశువుల ఆరోగ్యం తదితర అంశాలపై ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఆడ పిల్లలకు పెళ్లి వయస్సు వచ్చే వరకు పెళ్లిళ్లు చేయొద్దన్నారు. ఆరోగ్యం పట్ల మహిళలు, పిల్లలు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసే పౌష్టికాహారాన్ని ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పిల్లలను ఎవరైనా అక్రమ రవాణా చేస్తే అది చట్టరీత్యానేరమని హెచ్చరించారు. ఏవైనా సమస్య ఉంటే హెల్ప్‌లైన్, పోలీసులకు ఫోన్ చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్లు లక్ష్మి, సంతోష, డిస్ట్రిక్ట్ మిషన్ కో ఆర్డినేటర్ సంతోష, చైల్డ్ హెల్ప్‌లైన్ కో ఆర్డినేటర్ గంగాధర్ ఐసీసీఎస్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Vishnupriya | బెట్టింగ్ యాప్ కేసు.. విష్ణుప్రియ ఫోన్‌ని సీజ్ చేసిన పంజాగుట్ట పోలీసులు