సిద్దిపేట, ఆగస్టు13: సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అనేక మంది వైర ల్ ఫీవర్ బారిన పడ్డారు. జిల్లాలో 8654 మంది సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారు. 5140 మందికి డెంగీ పరీక్షలు చేయ గా 25 కేసులు నమోదయ్యాయి. ఇటీవల గజ్వేల్ ఆర్‌అండ్‌ఆర్‌కాలనీలో బాలుడు డెంగీతో మృతి చెందాడు. 6495 మందికి మలేరియా పరీక్షలు చేయగా ఒక కేసు పాజిటీవ్‌గా వచ్చింది. 2,186 మందికి టైఫాయిడ్ పరీక్షలు చేయగా 27మందికి ఉన్న ట్లు తేలింది.
జిల్లా వ్యాప్తంగా రోజూ4050 వరకు ఓపీ నమోదు కాగా ప్రస్తుతం 5450కి పెరిగింది. డయేరియాకు సంబంధించి 1650 కేసులు నమోదైనట్లు అధికారులు తెలుపుతున్నప్పటికీ ప్రైవేట్ దవాఖానల్లో అనేక మంది రోగులు వైద్యం సేవలు పొం దుతున్నారు. జిల్లాలోని పుల్లూరు పీహెచ్సీ,చింతమడక పీహెచ్సీలో ఫార్మాసిస్టులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారు విధులకు రావడం లేదు. పుల్లూరు పీహెచ్సీ ఆవరణంలో పిచ్చిమొక్కలు దర్శనమిస్తున్నాయి.
ఇక్కడ సీనియర్ ఆసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగి విధులకు హాజరుకాలేదు. చింతమడక పీహెచ్సీలో ల్యాబ్ టెక్నీషియనే ఫార్మాసిస్టుగా విధులు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట పట్టణంలోని నాసర్‌పుర పీహెచ్సీలో మందులు లేవని బయట తెచ్చుకోవాలని వైద్య సిబ్బంది రోగులకు సూచిస్తుండ డంతో అవస్థలు పడుతున్నారు.
నాకు ఆరోగ్యం బాగాలేక నాసర్పురలోని ప్రభుత్వ దవాఖానకు వచ్చా. డాక్టర్ నాలు గు రకాల మందులు రాస్తే మూడు రకాలు మాత్రమే దవాఖానలోఉన్నాయి. ఒకటి బ యట తెచ్చుకోమని చెప్పారు.
– మల్లయ్య, ఖాదర్‌పుర, సిద్దిపేట జిల్లా