అల్లాదుర్గం, మార్చి 05 : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మండల ప్రత్యేక అధికారి కరుణాకర్ సూచించారు. బుధవారం అల్లాదుర్గంలోని కేజీబీవీ, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి పలు రికార్డులను తనిఖీ చేశారు. భోజనం మంచిగా పెడుతున్నారా..? పాఠాలు ఎలా భోదిస్తున్నారు..? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, మెనూ ప్రకారం భోజనం పెట్టాలన్నారు. నాణ్యత లేని భోజనాన్ని వడ్డిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. వంటశాలలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీఈవో చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
జడ్పిహెచ్ఎస్ బాలుర పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా సివిల్ సప్లై అధికారి
అల్లాదుర్గంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలను బుధవారం జిల్లా సివిల్ సప్లై అధికారి కొమ్మిడి సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు వంట పాత్రలను అందజేసింది. ఇట్టి వంట పాత్రలు పాఠశాలలో ఉన్నాయా లేదా..? వాటిని వినియోగిస్తున్నారా..? లేదా అని పరిశీలించారు. తదనంతరం వంట గదిని పరిశీలించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పంపిణీ చేసిన వంట సామాగ్రిని సద్వినియోగం చేసుకోవాలని, వంట గది పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని అన్నారు. కార్యక్రమంలోఎంఈవో ధనుంజయ, ఇంచార్జి హెచ్ఎమ్ పిచయ్య, ఉపాద్యాయులు వీరప్ప తదితరులు ఉన్నారు.