పటాన్చెరు, మార్చి 29 : విద్యార్థులకు ‘మన ఊరు- మన బడి’ బంగారు భవిత అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం పటాన్‌చెరులోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో ‘మన ఊరు- మన బడి’ అమలుపై నియోజకవర్గ స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. మొదటి విడుతలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో 55 పాఠశాలలను ఎంపిక చేశారన్నారు. ప్రతి పాఠశాలలో వసతులను కల్పించడానికికి నిధులు అందజేస్తామన్నారు. రెండో విడుతలో మరిన్ని పాఠశాలలను ఎంపిక చేస్తామన్నారు. నాణ్యమైన ఆంగ్లమాధ్యమ విద్య నేటి తరానికి ఎంతో అవసరం అన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ సుష్మశ్రీవేణుగోపాల్‌రెడ్డి, జడ్పీటీసీలు సుధాకర్‌రెడ్డి, సుప్రజావెంకట్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, కార్పొరేటర్లు సింధూఆదర్శ్‌రెడ్డి, పుష్పానగేశ్ పాల్గొన్నారు.
– మెదక్ జిల్లా మానిటరింగ్ అధికారి కల్యాణి
వెల్దుర్తి, మార్చి 29 : అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంతో పేదల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని మెదక్ జిల్లా మానిటరింగ్ అధికారి కల్యాణి అన్నారు. వెల్దుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న రెండో విడుత ఉ పాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని ఎంఈవో యాదగిరితో కలిసి పరిశీలించారు. లక్షలాది పేద, మ ధ్యతరగతి విద్యార్థులందరికీ ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన అందుబాటు లోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ సాంబయ్య, ఆర్పీలు బాలరాజు, అశోక్, అమీరుద్దీన్, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల టీచర్లు పాల్గొన్నారు.