పాపన్నపేట, మే 11 : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కుర్తివాడ గ్రామంలో ఆదివారం జరిగింది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం..గ్రామానికి చెందిన కర్రోళ్ల శేఖర్ (62) స్థానిక హనుమాన్ ఆలయంలో పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం మందులు తెచ్చుకునేందుకు తన టీవీఎస్ ఎక్సెల్ పై పాపన్నపేటకు బయలు దేరాడు.
గ్రామ గేటు వద్దకు రాగానే మిన్ పూర్ వైపు నుండి మెదక్ వైపు వెళ్లే బైక్ వేగంగా ఢీ కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని ఎస్సై పేర్కొన్నారు.