Bike Skid | నర్సాపూర్, అక్టోబర్ 22 : బైక్ స్కిడ్ అయ్యి క్రింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నర్సాపూర్ మండల పరిధిలోని రుస్తుంపేట్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.
ఎస్ఐ రంజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రుస్తుంపేట్ గ్రామానికి చెందిన మన్నె యాదగిరి(41) మంగళవారం సాయంత్రం తన కుమారుడిని శివంపేట్ హాస్టల్‌కు పంపడానికని బైక్‌పై నర్సాపూర్ బస్టాండ్‌కు వచ్చి తన కొడుకును బస్సులో ఎక్కించాడు. అనంతరం సొంత పని నిమిత్తం నర్సాపూర్ నుండి మండల పరిధిలోని సీతారాంపూర్ గ్రామానికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. బుధవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో పంట పొలాల వద్ద రోడ్డుపై పడి తలకు, ముక్కుపై బలమైన గాయాలై మృతి చెంది ఉన్నాడు.
రాత్రి సమయంలో తన బైక్‌పై నుండి తనకు తానుగా రోడ్డుపై స్కిడ్ అయ్యి చనిపోయాడని మృతుడి భార్య మన్నె గంగమ్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంజిత్ కుమార్ వెల్లడించారు.
Tejashwi Yadav: జీవికా దీదీలకు 30 వేల జీతం: తేజస్వి యాదవ్
Road Accident: ఢీకొన్న రెండు బస్సులు.. 63 మంది మృతి
Nidamanoor : రైతులకు మద్దతు ధరే లక్ష్యం : అంకతి సత్యం