Thief | రామాయంపేట పట్టణంలోని ఎల్లమ్మ కాలనీలో వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగడమే కాకుండా ఓ ఇంటి తాళాలు పగుల గొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన కాలనీవాసులు ఆ దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
కాలనీవాసుల కథనం ప్రకారం పట్టణంలోని పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే కాలనీ ఉంది. ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతంలోనే ఓ గుర్తుతెలియని వ్యక్తి ఓ ఇంటి తాళాలను పగులగొడ్తున్నాడు. దొంగను గమనించిన కాలనీ వాసులు పట్టుకుని రామాయంపేట పోలీసులకు అప్పగించారు. అనుమానాస్పద వ్యక్తిని పోలీసులు ఆరా తీయగా సిద్దిపేట పట్టణం అంటూ చెబుతున్నాడు. దొంగ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
Vishnupriya | బెట్టింగ్ యాప్ కేసు.. విష్ణుప్రియ ఫోన్ని సీజ్ చేసిన పంజాగుట్ట పోలీసులు