కన్నుల పండువగా మల్లికార్జునుడి కల్యాణం
బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శివరాత్రిని పురస్కరించుకుని ఆదివారం స్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
- కొనసాగుతున్న బీరంగూడ జాతర
- పట్టు వస్ర్తాలు సమర్పించిన చైర్మన్ తుమ్మల దంపతులు
అమీన్పూర్, ఫిబ్రవరి 19: బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శివరాత్రిని పురస్కరించుకుని ఆదివారం స్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రెండో రోజు సైతం జాతరకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మల్లికార్జునుడికి రుద్రాభిషేకం, అమ్మవారికి లలితా సహస్ర నామార్చన చేశారు. సాయంత్రం స్వామి వారిని నంది వాహన సేన ఊరేగింపుతో భక్తులతో ఈ ప్రాంతమంతా కిటకిటలాడింది. రాత్రి ఎనిమిది గంటలకు హారతి మంత్రపుష్పాలు తదితర కార్యక్రమాలు చేపట్టారు. మున్సిపల్లోని జయలక్ష్మి నగర్ కాలనీలో పట్లోల్ల భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దీంతో పాటే బీరంగూడలోని శంభులింగేశ్వర ఆలయంలో కల్యాణం చేశారు. మహా శివరాత్రి సందర్భంగా శివ భక్తులు ఉపవాస దీక్షలు చేసి స్వామి సన్నిధిలో విరమించారు. శివరాత్రి పెద్దఎత్తున భక్తులు జాగారం చేశారు.
వైభవంగా స్వామి కల్యాణం
మహా శివరాత్రి పర్వదినాన రెండో రోజు మల్లికార్జునుడి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కల్యాణంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సతీమణి యాదమ్మ ఆలయ మాజీ చైర్మన్ తులసిరెడ్డి దంపతులు, కమిషనర్ సుజాత, ఆలయ కమిటీ సభ్యుడు దాస్యాదవ్తోపాటు కౌన్సిలర్లు బాశెట్టి కృష్ణ, కల్పన ఉపేందర్‌రెడ్డి, బిజిలీ రాజు, భక్తులు పాల్గొన్నారు.
స్వామిని దర్శించుకున్న ఎస్పీ రమణకుమార్
బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతరను సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ సందర్శించారు. అనంతరం స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జాతర విజయవంతంగా పూర్తి చేసేంతవరకు కట్టు దిట్టమైన భద్రత చర్యలు తీసుకుని, ఎక్కడా సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

