Mallikarjuna Swamy | మెదక్ రూరల్, జనవరి 25 : మెదక్ మండలంలోని మంబోజిపల్లి శివారులోని కొయ్యగుట్టపై కొలువుదీరిన మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మల్లన్నస్వామి జాతర ఆలయ పూజారి మల్లన్న ఆధ్వర్యంలో ఆదివారం మల్లన్న కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మల్లన్న స్వామికి ఉదయం నుండే ప్రత్యేక పూజలు, గంగా, యమునా, సరస్వతీ పుణ్యనదీజలాలతో ఏకాదశ రుద్రభిషేకం నిర్వహించారు.
ఆలయ ప్రాంగణంలో మల్లన్న స్వామి కల్యాణాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా భక్తులు ఓడి బియ్యం సమర్పించారు. సాయంత్రం బండ్ల ఊరేగింపు, ఒగ్గు కళాకారుల నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ జిల్లాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున మల్జికార్జున స్వామి ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
మల్లన్న స్వామి ప్రత్యేక పూజల్లో ఆలయ అర్చకులు మల్లన్నస్వామి, మల్లికార్జున్, పాల్గొన్నారు.

Man Killed Attacked Leopard | వ్యక్తిపై చిరుత దాడి.. దానిని ఎలా చంపాడంటే?
T20 World Cup | పాకిస్తాన్కు ఐసీసీ వార్నింగ్.. తోక ముడిచిన పాక్.. టీ20 జట్టు ప్రకటన
Narsapur | చిత్తారమ్మ దేవి ఆలయంలో హుండీ పగలగొట్టి నగదు దోచుకెళ్లిన దుండగులు