చేగుంట, ఫిబ్రవరి 19: చేగుంట మండలంలోని ఉల్లితిమ్మాయిపల్లి రాజరాజేశ్వరి దేవాలయం, రాంపూర్ శివాలయం, నార్సింగిలోని మల్లన్న జాతర ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం ఈ జాతరల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైలరాం బాబు, తాడెం వెంగళ్రావు, వైస్ ఎంపీపీ దొబ్బల సుజాత, మాజీ వైస్ ఎంపీపీ ఆకుల మల్లేశంగౌడ్, అంచనూర రాజేశ్, ఎన్నం రాజేందర్‌రెడ్డి, తౌర్యనాయక్, సత్యం, యాదవ సంఘం నాయకులు, ఆలయ కమిటీ సభ్యుడు భాస్కర్, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, బాణపురం కృష్ణారెడ్డి, నాయకులు బిస్కి సాయికుమార్, పట్నం తానీషా, వంటరి అశోక్‌రెడ్డి, సుదర్శనం, బోయిన భూషణం తదితరులున్నారు.